![]() |
![]() |
.webp)
ప్రతీ ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ అనేది కచ్చితంగా ఉంటుంది. ఐతే అందులో కొంతమంది తొలిప్రేమలే సక్సెస్ అవుతాయి ఇంకొంతమంది తొలి ప్రేమలు మిడిల్ బ్రేక్ అవుతాయి లేదంటే రకరాల ఇష్యుస్ తో రచ్చ రచ్చ అవుతుంటాయి. ఈ పాయింట్ మీద శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమోని డిజైన్ చేసింది. అదే తొలిప్రేమ కాన్సెప్ట్. ఈ ప్రోమో అంతా ఎమోషనల్ గా సాగింది. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో అనుభవించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.
జబర్దస్త్ లో ఢీ కమెడియన్ సన్నీ తన తొలిప్రేమ బ్రేకప్ గురించి డేట్ తో సహా చెప్పాడు 2010 మార్చ్ 29 న అంటూ సంధ్య థియేటర్ టికెట్ ని కూడా చూపించాడు. జీవితంలో ఎందుకు ఈ విషయాన్నీ మర్చిపోలేదు అని రష్మీ అడిగేసరికి ఆ అమ్మాయి తర్వాత వేరే అమ్మాయిని చూడబుద్ది కాలేదు అని చెప్పాడు. ఇక నైనికా వచ్చిందా. ఒకప్పుడు మీరు సైనిక అని కూడా బాగా ఫేమస్ అయ్యారు దాని గురించేనా మేము డిస్కస్ చేయబోతున్నాము అని రష్మీ అడిగింది. స్క్రీన్ మీద కనిపించేదంతా నిజం కాదు. స్క్రీన్ వెనక ఇంకొక స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఒక అభ్యుజివ్ రిలేషన్ షిప్ లో ఉండక్కర్లేదు. ఇది అలాంటిది అంటూ చాలా మాటలు చాలా టాగ్స్ ఇచ్చారు నాకు. ఇక యాంకర్ శివ వచ్చాడు.ఆమె ఈ టీషర్ట్ ఇచ్చింది. కాదు ఇది వర్కౌట్ అవ్వదు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది.
మరి ఈ టీ షర్ట్ పరిస్థితి ఏంటి అని రష్మీ అడిగేసరికి దాన్ని చించి ముక్కలు చేసాడు. తర్వాత పృద్వి శెట్టి వచ్చి లవ్ అయ్యింది బ్రేకప్ అయ్యింది నేనే బాధపడాలి అని వదిలేసానని చెప్పాడు. తర్వాత అరియనా వచ్చింది. ఒక్క మాట నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. రేడియో జాకీ అవ్వాలనుకుంటోంది. ఏదో ఒక రోజు అదే స్టూడియో ముందు నేనీ 10 రూపాయలో 100 రూపాయలో పడేస్తా ఆడుకుంటుంది అది రోడ్డు మీద. అని. అతను అలా అంటాడని నాకు ఈ రోజు వరకు నేను ఊహించలేకపోయాను. సత్య వచ్చి తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ గురించి చెప్పింది. రెండేళ్లు అలా ఉండి ఒక్కసారిగా అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కూడా ఐపోయింది. మా నాన్నకు ఫోన్ చేసి ఇది జరగదు అని చెప్పేసాడు. అది కట్నం గురించే అని నేను అనుకున్నా. ప్రేమ వివాహంలో డౌరీనా అని రష్మీ అడిగింది. అవును. ఎవరైనా కొంచెం సీరియస్ గా చూస్తే ఏడ్చే అమ్మాయిని నువ్వు ఏడుపు రాకుండా చేసేసావ్ అంటూ బాధపడుతూ చెప్పింది సత్య.
![]() |
![]() |